కేరళలో కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి పాత్ర: తెలంగాణ కాంగ్రెస్ నేత

  • కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయన్న అద్దంకి దయాకర్
  • కేరళ అభివృద్ధిపై విజయన్‌ను నిలదీసినట్లు వెల్లడి
  • తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేశారని వెల్లడి
కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ప్రభుత్వం ఏర్పాటుకు 71 సీట్లు అవసరం కాగా, యూడీఎఫ్ కూటమి 100కి పైగా స్థానాల్లో గెలుపొందింది. మరోవైపు, అధికార ఎల్డీఎఫ్ కూటమి ఇప్పటిదాకా 33 స్థానాల్లో గెలుపొందింది. 

కేరళ ఫలితాలపై అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, యూడీఎఫ్ విజయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్‌పై రేవంత్ రెడ్డి నేరుగా విమర్శలు చేశారని గుర్తు చేశారు. కేరళ అభివృద్ధిపై విజయన్‌ను నిలదీయడంతో పాటు లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు. అదే సమయంలో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేరళ ప్రచారంలో ముఖ్యమంత్రి వివరించారని గుర్తు చేశారు.

Revanth Reddy
Kerala Congress
Telangana Congress
Addanki Dayakar
UDF Victory
Kerala Assembly Elections

More Telugu News